Description
శ్రీ చక్రధ్యానము
శ్లో।। బిందుత్రికోణ వసుకోణ దశౌరయుగ్మ
మన్వశ్ర నాగదళ సంయుత షోడశారమ్ !
వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ
శ్రీ చక్రమేత దుదితం పరదేవతాయాః !!
శ్రీ మాత శరీరమే శ్రీ చక్రము. కాబట్టి శ్రీ చక్రమును
స్వశరీరముతో తాదాత్మ్యము గావించి ధ్యానించినచో సాధకుడు జగజ్జననితో ఐక్యము చెందును.
1. త్రైలోక్య మోహన చక్రం → భూపురం → పాదములు
వృత్తత్రయము → మేఖలోత్రయం → ఊరువులు
2. సర్వాశా పరిపూరణ చక్రం → షోడశారం → కటి భాగం
3. సర్వసంక్షోభణ చక్రం → అష్టదళపత్రం → నాభి
4. సర్వసౌభాగ్యదాయక చక్రం → చతుర్దశ కోణం → హృదయం
5. సర్వార్ధ సాధక చక్రం → బహిర్ద శారం → కంఠం
6. సర్వ రక్షాకర చక్రం → అంతర్ద శారం → భ్రూమద్యం
7. సర్వరోగ హర చక్రం → అష్ట వసు కోణం → లలాటం
8. సర్వసిద్ధిప్రద చక్రం → త్రికోణం → మస్తకం
9. సర్వానందమయ చక్రం → బిందువు → బ్రహ్మ రంధ్రం
శ్రీ చక్ర పరిరక్షకులు – పరివారము
త్రైలోక్యమోహన చక్రము
• సమాన కేంద్రంతో విస్తరించి ఉన్న మూడు వృత్తాలకు బాహ్యంగా మూడు రేఖాప్రాకారాలతో కూడిన చతురస్రం. ఇది భూపుర మనబడుతుంది. చిట్టచివరగా ఉండే మొదటి రేఖ మీద గోచరించే సిద్ధులు; అణీమ, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, భుక్తి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ మొత్తం=10
• సప్తమాతృకలు మరియు వారి సామూహిక మూర్తి. 2వ రేఖ మీద నుండే దేవతలు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహీ, ఇంద్రాణీ, చాముండా, మహాలక్ష్మి, మొత్తం=8.
• వీరే ముద్రశక్తులు, నవచక్రాలను పరిరక్షించేవారు. లోపలనుండే 3వ రేఖమీది దేవతలు. సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి,సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండ-మొత్తం=8
సర్వాశాపరిపూరకచక్రము
షోడశదళపద్మము, అధి దేవతలు 16. 1) కామాకర్షిణీ 2) బుద్ఘ్యాకర్షిణి పదునారు 3) అహంకారాకర్షిణి 4) శబ్దాకర్షిణి 5) స్పరాకర్షిణీ 6) రసాకరిణీ 7) సర్శాకర్షిణి 8) గంధాకర్షిణి 9) చిత్తాకర్షిణీ 10) ధైర్యాకర్షిణి 11) స్మృత్యాకర్షిణి 12) నామాకర్షిణి 13) బీజాకర్షిణి 14) ఆత్మాకర్షిణీ 15) అమృతాకర్షిణీ 16) శారీరికాకర్షిణి. మొత్తం =t6.
సర్వసంక్షోభణ చక్రము
అష్టదళపద్మము, అధిదేవతలు. 1) అనంగ కుసుమ 2) అనంగ మేఖల 3) అనంగ మదన 4) అనంగ మదనాతుర 5) అనంగ లేఖ 6) అనంగ వేగిని 7) అనంగాంకుశ 8) అనంగ మాలీని మొత్తం=8.
సర్వసౌభాగ్యదాయక చక్రము
పదునాలుగు త్రికోణములు అధిదేవతలు 1) సర్వసంక్షోభిణి 2) సర్వవిద్రావిణి 3) సర్వాకర్షిణీ 4) సర్వాహ్లాదిని 5) సర్వసమ్మోహిని 6) సర్వస్తంభిని 7) సర్వ జృంభిణి 8) సర్వవశంకరి 9) సర్వరంజనీ 10) సర్మోన్మాదిని మొత్తం 11) సర్వార్థ సాధిని 12) సర్వ సంపత్తి పూరణి 13) సర్వమంత్రమయి 14) సర్వద్వంద్వక్షయకరి మొత్తం=14.
సర్వార్థసాధక చక్రము
బాహ్యంగావుండే పది ఎఱ్ఱని త్రికోణములు అదీదేవతలు=10. 1) సర్వసిద్ధిప్రద 2) సర్వసంపత్ ప్రద 3) సర్వప్రియంకరి 4) సర్వమంగళకారిణి
5) సర్వకామప్రద 6 సర్వ దుఃఖ వివమోచని 7) సర్వమృత్యు ప్రశమని 8) సర్వవిఘ్న నివారిణి 9) సర్వాంగసుందరి 10) సర్వసౌభాగ్య దాయిని మొత్తం=10.
సర్వరక్షాకార చక్రము
లోపలి నీలిరంగు పది త్రికోణములు. అధిదేవతలు పది. 1) సర్వజ్ఞ 2) సర్వశక్తి 3) సర్వఐశ్వర్య ప్రద, 4)సర్వజ్ఞానమయి, 5) సర్వవ్యాధి వినాశిని 6) సర్వాధారస్వరూప 7) సర్వ పాపహర 8) సర్వోనంద మయి, 9) సర్వరక్షా స్వరూపిణీ10) సర్వేప్సిత దాయిని మొత్తం=10
సర్వరోగహర చక్రము
ఎఱ్ఱని ఎనిమిది త్రికోణములు. లలితా సహాస్రనామాలనందించిన వాగ్దేవతలు వీటి అదిదేవతలు. 1) వశిని 2) కామేశి 3) మోదిని 4) విమల 5) అరుణ 6) జయిని 7) సర్వేశి 8) కౌలినీ మొత్తం =8.
సర్వసిద్ధిప్రద చక్రమునకు సర్వరోగహరచక్రమునకు మధ్యగల ప్రదేశంలో లలితాపరాదేవతయొక్కఆయుధాగారం కలదు. దేవి ఆయుధములు :- ఇక్షు ధనుస్సు పంచ పుష్ప బాణాలు, పాశం మరియు అంకుశము.
సర్వసిద్ధిప్రద చక్రము
బిందువు చుట్టూ ఉండే త్రిభుజం. 1) కామేశ్వరీ 2) వజేశ్వరి 3) భగమాలినీ
సర్వానందమయ చక్రము
ఎఱ్ఱని కేంద్ర బిందువు. లలితా కామేశ్వరులు
మరిన్ని విశేషాలు ఈ ఉపనిషత్తులో
Reviews
There are no reviews yet.